తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్

April 11, 2022

nfgbf

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతులు బాగుపడాలంటే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించక తప్పని పరిస్థితులు ఉన్నాయన్నారు. రైతులను నట్టేట ముంచడానికి కేసీఆర్ పూనుకున్నారని, కానీ, నెపం మాత్రం కేంద్రంపై నెడుతున్నారని దుయ్యబట్టారు. అప్పుడు ఒప్పందం మీద సంతకం పెట్టి, ఇప్పుడు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుట్రను రైతులు, ప్రజలు అంతా గమనిస్తున్నారినీ, వారే టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్తారన్నారు. రాజకీయాల కోసం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడానికి ప్రత్యేక విమానంలో వెళ్లడానికి డబ్బులుంటాయి కానీ, పంట కొనడానికి మాత్రం డబ్బుల్లేవా? అని ప్రశ్నించారు. బీజేపీ వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. కుటుంబ పాలనకు ప్రజలు త్వరలో చరమగీతం పాడుతారని విమర్శించారు.