BJP leaders expressed their anger over the dressing of the YCP MLA anil kumar
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యేని శబరిమల వెళ్లకుండా అడ్డుకోండి.. బీజేపీ డిమాండ్

November 25, 2022

BJP leaders expressed their anger over the dressing of the YCP MLA anil kumar

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న ఆయన ముస్లిం టోపీ, కండువా ధరించారు. నెల్లూరులోని ఖుద్దూస్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనిల్ ఇంటింటికీ తిరిగారు.

ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో వారి మతాచారలకు అనుగుణంగా ఆయన టోపీ, కండువా ధరించడం బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. దీక్షలో ఉండి అయ్యప్ప భక్తులను అవమానించిన అనిల్ కుమార్ ను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు హిందువులు సహించరనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. విష్ణు వర్ధన్ రెడ్డి స్పందిస్తూ అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తులకు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని, ఇలాంటివి సహించబోమని హెచ్చరించారు.