BJP leaders file case against director Ram Gopal Varma for making tweet on Draupadi Murmu
mictv telugu

ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ అనుచిత ట్వీట్‌.. పోలీసులకు ఫిర్యాదు

June 24, 2022

BJP leaders file case against director Ram Gopal Varma for making tweet on Draupadi Murmu

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఓ మహిళపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు హైదరాబాద్ లోని అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్‌ పోలీసులను కోరారు. మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఏంటంటే.. ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? అంటూ రాశారు. వైర‌ల్ అయిన ఈ ట్వీట్‌పై బీజేపీ నాయ‌కులు ఫిర్యాదు చేశారు.