BJP leaders invited Nitin instead of Karthikeya 2 hero Nikhil
mictv telugu

నిఖిల్‌కు బదులు నితిన్‌ను.. పప్పులో కాలేసిన తెలంగాణ బీజేపీ నేతలు!

September 8, 2022

కొన్ని రోజుల క్రితం ఓ సభ కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం అటు తెలుగు సినీ వర్గాల్లో కాక తెలుగు రాష్ట్ర ప్రజలలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా మరో సినీ హీరో నితిన్ ను, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ భేటీ అవ్వడం తెలంగాణలో బిజెపి పట్టు పెంచుకునేందుకు సినీ గ్లామర్ ను ఉపయోగించుకోబోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాకుండా త్వరలోనే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ తతంగం అంతా జరిగి చాలా రోజులు అయింది. దీనికి సంబంధించి పొలిటికల్ గాసిప్స్ అనేకం వచ్చాయి. అయితే నితిన్ తో నడ్డా భేటీ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు పొరబడ్డారనే విషయం ఆ పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా జేపీ నడ్డా కలవాలనుకున్నది హీరో నిఖిల్ ను కానీ ఆయనకు బదులుగా నితిన్ ను ఆహ్వానించారనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్యఅతిథిగా జేపీ నడ్డా హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హీరో నితిన్ ను జేపి నడ్డా కలిశారు.

అయితే వాస్తవంగా జేపీ నడ్డా భేటీ కావాలనుకుంది నితిన్ ను కాదని, కార్తికేయ 2 లో హీరోగా నటించిన నిఖిల్ ని అని, కార్తికేయ 2 సినిమా బాలీవుడ్ లోనూ హిట్ టాక్ తెచ్చుకోవడంతో , నిఖిల్ ను కలిసి అభినందించాలి అని జేపీ నడ్డా భావించారట. అయితే పొరపాటున నితిన్ ను పిలవాలంటూ ఆయన తెలంగాణ బిజెపి నేతలకు సూచించడంతో వారు నితిన్ ను పిలవడం తోనే ఈ వ్యవహారం అంతా చోటు చేసుకుందట. పేరు విషయంలో కన్ఫ్యూజ్ కావడంతోనే ఈ తతంగం అంతా జరిగినట్లు సమాచారం.