'ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ ఖాయం'
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను ఎవరూ ఆపలేరంటూ వ్యాఖ్యానించారు. రేపో మాపో కవిత అరెస్ట్ ఖావడం ఖాయమని తెలిపారు. అవినీతి సొమ్ముతో కవిత ఢిల్లీలో 600 మద్యం షాపులు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం తిరుమలకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిపైన కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌పై వ్యతిరేకత బయటపడిందని తెలిపారు. ప్రజల్లో ఉన్న ఆ వ్యతిరేకతను మరల్చడానికే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీపై అనవసర ఆరోపణలు చేశారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ ద్వారానే సాధ్యమని తెలిపారు.
బీజేపీ తాను అమ్ముడుపోయానంటూ జరిగిన ప్రచారంపై కూడా రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి కలిసి తనపై అనవసర ప్రచారం చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరికీ అమ్ముడుపోలేదని శ్రీవారి సాక్షిగా కోమటిరెడ్డి ప్రమాణం చేశారు. ఆరోపణలను రుజువు చేయాలంటూ సవాల్ విసిరారు.