Home > Featured > రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మేం చేసే మొదటి పని అదే.. ఈటల

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మేం చేసే మొదటి పని అదే.. ఈటల

రాష్ట్రంలో అహంకారం అధికారం చలాయిస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. “కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందా” అని నిలదీశారు. రేవంత్ రెడ్డి స్వార్థం కోసం రాజకీయాలు చేస్తారని.. అలాంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేసే రాజగోపాల్ రెడ్డిని విమర్శించడం ఏంటని వ్యాఖ్యానించారు. “రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే స్థాయి ఉందా” అని వ్యాఖ్యానించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. “రాజగోపాల్ రాజీనామా చేస్తానంటే మునుగోడు ప్రజలు సంబరపడుతున్నారని.. ఉపఎన్నిక వస్తే సమస్యలు తీరుతాయని” భావిస్తున్నారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక సీఎం కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని చెప్పారు. రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించగానే రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. అలా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో చులకన అవుతారని చెప్పారు. మమ్మల్ని తిట్టడం మానేసి కేసీఆర్‌తో కొట్లాడాలని ఈటల అన్నారు. రాజగోపాల్ రెడ్ది బీజేపీలో చేరగానే రాష్ట్ర నాయకత్వమంతా మునుగోడులో మోహరిస్తామని తెలిపారు.

Updated : 3 Aug 2022 5:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top