కర్ణాటక ఉపఎన్నికలు..దూసుకెళ్తున్న బీజేపీ - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటక ఉపఎన్నికలు..దూసుకెళ్తున్న బీజేపీ

December 9, 2019

Bjp leading in karnataka.

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ పార్టీ దూసుకెళ్తుంది. ఈనెల ఐదవ తేదీన 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 12 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 2 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశముంది. 

ఎల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హెబ్బర్‌ శివరామ్‌ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. కర్ణాటకలో మొత్తం 223 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం బీజేపీ సంఖ్యా బలం 105. ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉంది. బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే తాజా ఫలితాల్లో కనీసం ఆరుచోట్ల గెలవాల్సి ఉంది. అయితే, దాదాపు 12 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి.