ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా.. పంజాబ్‌లో ఆప్ ఆధిక్యం - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా.. పంజాబ్‌లో ఆప్ ఆధిక్యం

March 10, 2022

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. దాదాపు నాలుగు రాష్ట్రాల్లో అధికారం నిలుపుకునే దిశగా పరిగెడుతోంది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, గోవా, మణిపూర్‌లలో అధికార బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పరచే అవకాశాలున్నాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 263 స్థానాల్లో ముందంజలో ఉంది.

తర్వాత సమాజ్ వాదీ పార్టీ 102 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్ల సంఖ్య 202. మణిపూర్‌లో బీజేపీ 25, కాంగ్రెస్ 11 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. మేజిక్ ఫిగర్ 31. ఉత్తరాఖండ్‌లో బీజేపీ 46 చోట్ల, కాంగ్రెస్ 20 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. 36 సీట్లల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. గోవాలో బీజేపీ 18. కాంగ్రెస్ 11, ఇతరులు 10 సీట్లలో ఆధిక్యం కనబరుస్తున్నారు. మేజిక్ ఫిగర్ 21. పంజాబ్‌లో ఆప్ పార్టీ 89, కాంగ్రెస్ 13, బీజేపీ 5 సీట్లల్లో గెలుపు దిశగా సాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల సంఖ్య 59. కాగా, ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.