అమిత్ షా ఎన్నికల వ్యూహం - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్ షా ఎన్నికల వ్యూహం

August 18, 2017

 

రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే ప్లాన్ చేస్తోంది. మిషన్ 2019 పేరుతో 350 లోక్ సభ స్థానాలలో గెలుపొందాలని వ్యూహలను పన్నుతోంది. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పొందిన రాష్ట్రాలలోని 150 స్థానాలపై దృష్టి పెట్టింది. బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేతలకు అన్ని అంశాల గురించి వివరించాడు.

పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో 2014 లో ఎన్నికల్లో కోల్పోయిన 150 లోక్ సభ స్థానాలను దక్కించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సమావేశంలో 31 మంది నేతలు పాల్గొన్నారు. అందులో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆనంత్ కుమార్, జే పి నడ్డా, పార్టి నేతలు రామ్ లాల్, అనిల్ జైన్, భూపేందర్ యాదవ్ లు ఉన్నారు. 2019 ఎన్నికలల్లో 350 పైగా లోక్ సభ స్థానాలలో గెలుపొందాలని పార్టీ నేతలకు అమిత్ షా తెలిపారు.