BJP LOSS IN Munugode..5 Reasons...
mictv telugu

బీజేపీ ఓటమికి ఐదు కారణాలు ఇవే..!

November 6, 2022

మునుగోడులో బీజేపీ ఎందుకు ఓడిపోయింది.? ఓటమికి కారణాలేంటి?చివరి మూడు రోజులే కమలం కొంపముంచాయా?కేసీఆర్ ఫైనల్ టచ్‌తో ఓటర్ల మనస్సు మార్చేస్తారా?ఫామ్‌హౌస్ ఫైల్స్ ప్రభావం చూపాయా? కేసీఆర్ రగిల్చిన సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? పరిస్థితుల్ని చూస్తే అవుననే అనిపిస్తోంది. బీజేపీ ఓటమికి ఐదు కారణాలు ఇవే.

కారణం 1 ఆ మూడ్రోజులు ముంచేశాయ్

మునుగోడు ఉపఎన్నిక దేశం మొత్తం చూపు తనవైపు తిప్పుకుంది. ఎన్నికలషెడ్యూల్ నుంచి రిజల్డ్ దాకా చర్చల్లో ఉంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. క్యాంపెయిన్‌లోనే కాదు ఫలితాల్లోనూ రౌండ్ టు రౌండ్‌కు బీజేపీ పోటీనిచ్చింది. రెండు, మూడు రౌండ్లలో లీడ్ లోకి వచ్చిన బీజేపీ చివరిరౌండ్ రౌండ్ దాకా కారు స్పీడ్‌ని ఆపలేకపోయింది. చివరి మూడు రోజులే బీజేపీకి మైనస్‌గా మారాయి. పక్కా పోల్ మేనేజ్మెంట్ ముందే చేసేసిన గులాబీదళం…కమలం కార్యకర్తలకు అడుగడుగునా అడ్డుపడింది. బీజేపీ పోల్ మేనేజ్మెంట్ సాగకుండా చివరిదాకా సక్సెస్ ఫుల్‌గా అడ్డుందని బీజేపీ కార్యకర్తలే స్వయంగా చెబుతున్నారు. మూడు, నాలుగు చోట్ల గొడవలు కూడా కమలానికి మైనస్. టీఆర్ఎస్ కే మైలేజ్ వచ్చేలా పరిస్థితులు మారాయి. చౌటుప్ప ల్‌లో చివరి రోజు టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చింది.

కేసీఆర్ ఫైనల్ స్పీచ్

ఎన్నికలకు ముందు కేసీఆర్ మునుగోడులో సభ నిర్వహించారు. సూటిగా ఘాటుగా బీజేపీపై విమర్శలు చేశారు. ఫామ్‌హౌస్ ఫైల్స్ బాధిత ఎమ్మెల్యేల్ని పక్కనపెట్టుకుని ప్రజల్లో సెంటిమెంట్‌ని రగిల్చారు. ప్రజలు ఆలోచించి ఢిల్లీ కుట్రల్ని అడ్డుకోవాలని పదే పదే మాట్లాడారు. కూల్ కూల్‌గానే ఓటర్ల మదిలో గుచ్చుకునే బాణాల్ని దింపారు. బీజేపీకి డిపాజిట్ దక్కితే..తననే పక్కకు జరుపుతారని ప్రజల ఆలోచించేలా కేసీఆర్ స్పీచ్ సాగింది. పోలింగ్‌కు ముందు మునుగోడు వాసుల మనస్సు అంతో ఇంతో మార్చింది. ఇది కమలం వాడిపోవడానికి రెండో కారణం.

పథకాలు ఆగుతాయనే ప్రచారం…

పైన టీఆర్ఎస్ ప్రచారం పారదర్శకం.గ్రౌండ్ లెవల్లో పూర్తిగా భిన్నం. టీఆర్ఎస్ గెలువకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని ప్రచారం సాగింది. స్వయంగా ఒకరిద్దరు మంత్రులు ఓటు వేయకపోతే పథకాలు రావు అని బహిరంగంగానే చెప్పారు. దీనిపై పెద్దయెత్తున రచ్చ జరిగింది. ఇదంతా అసత్య ప్రచారమని అధికారులు క్లారిటీ ఇచ్చినా మునుగోడు వాసులకు నమ్మకం కుదిరనట్టు లేదు. ముఖ్యంగా పింఛదారులు గులాబీకి గంపగుత్తగా ఓటేశారని తెలుస్తోంది. మునుగోడులో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు రెండులక్షల మందికి పైగా ఉన్నారు. ఇదే బీజేపీ ఓటమికి మూడోకారణం.

18 వేల కోట్ల కాంట్రాక్ట్…కొంప ముంచింది…

18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారన్న ప్రచారం బాగా ప్రభావం చూపింది దీనికోసమే కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారన్న టీఆర్ఎస్ ఆరోపణలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. దీనిపై జనంలోనూ పెద్దయెత్తున చర్చ నడిచింది. ఈ ప్రచారాన్ని బీజేపీ సమర్థంగా తిప్పికొట్టలేకపోయింది. జనం దీనిపై నిలదీసినా వారిని ఒప్పించేవిధంగా సమాధానం ఇవ్వలేకపోయింది. ఆ 18 వేల కోట్లను మునుగోడులో కుమ్మరిస్తున్నాని టీఆర్ఎస్ పదే పదే ఆరోపణలు చేసింది.యాజ్ టీజ్ గా బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇదే బీజేపీకి పెద్దగా మైనస్…ఇదే నాలుగో కారణం

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ చేసిన తప్పుల్నే…

సింపుల్‌గా చెప్పాలంటే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఏం తప్పులు చేసిందో ఆవే తప్పుల్ని బీజేపీ మునుగోడులో చేసింది. ఆ తప్పుల్ని గులాబీదళం సరిదిద్దుకుంటే…బీజేపీ అందులోనే కూరుకుపోయింది. తులం బంగారం ఇస్తారన్న ప్రచారం బీజేపీని భారీగా దొబ్బకొట్టింది. నిజంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి తులం బంగారం ఇస్తున్నారన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియా చేసింది. నిజమే అనుకున్న ఓటర్లు తులం బంగారం కోసం ఎదురుచూశారట.తీరా బీజేపీ నాయకులెవరూ తమ దగ్గరకు రాలేదంటూ ఈవీఎంల్లోప్రతాపం చూపారట. దీంతో పాటు లాస్ట్ మినిట్‌లో బీజేపీ అగ్రనేతల సభలు రద్దు అవటం రాజగోపాల్ రెడ్డికి మైనస్‌గా మారింది.