లక్కుంటే లక్కీ బైకులు..! - MicTv.in - Telugu News
mictv telugu

లక్కుంటే లక్కీ బైకులు..!

May 17, 2017

ఉత్తరాదిని ఊపేస్తోన్న బీజేపీ సౌతిండియాపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఆ పార్టీ చీఫ్ అమిత్ షా కాన్సంట్రేషన్ అంతా తెలుగురాష్ట్రాలపై ఉంది. ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.

ఇందులో భాగంగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే వినూత్న కార్యక్రమాల్ని బీజేపీ చేస్తోంది. కార్యకర్తలకి బైకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు యూపీ నుంచి తెలంగాణలోని ప్రధాన కార్యాలయానికి 120 బైకులను పంపింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కూడా బైకులను పంపనుంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు అందజేయనుంది. వీటికి లక్కీ బైకులుగా పేరు పెట్టారు.

బీజేపీ అంటే జేబు నుంచి ఖర్చు పెట్టుకునే పార్టీ అని ఆ పార్టీ కార్యకర్తలే సరదాగా చెప్పుకుంటుంటారు. ఏ కార్యక్రమైనా సొంత ఖర్చులతో అప్పట్లో చేస్తుండే వారు. కానీ అమిత్ షా వచ్చాక మార్చు వచ్చినట్టుంది. బీజేపీ కార్యకర్తలకు లక్కీ బైకుల కార్యక్రమం ఆ పార్టీ రాష్ట్ర నేతలకు బూస్ట్ ను ఇచ్చేలా ఉంది. చూడాలి ఈ బైకులపై తిరిగి వారు ఎన్ని సీట్లు గెలుస్తారో,,ఎన్ని ఓట్లు వేపిస్తారో…

HACK:

  • BJP has come out with an idea to strengthen their party in South India in the next general elections.
  • The party has brought around 120 bikes to Telangana state BJP office named as lucky bikes from UP for distribute to activists.