BJP Mahila Morcha Protest Against Belt Shops Tomorrow In Hyderabad
mictv telugu

BJP Mahila Morcha : కవిత దీక్షకు పోటీగా బీజేపీ దీక్ష..

March 9, 2023

bjp mahila morcha protest against belt shops tomarrow in hyderabad

కవిత దీక్షకు పోటీగా బీజేపీ కూడా దీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం దీక్ష చేపడుతుంగా ఆమెకు పోటీగా హైదరాబాద్ లో బెల్టు షాపులు, మహిళలపై జరిగే అరాచకాలకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా నేతలు దీక్ష చేయనున్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయం ప్రాంగణంలో జరుగనున్న ఈ దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. మహిళా నేతలంతా పెద్ద మొత్తంలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మద్యం బెల్టు షాపులతో రాష్ట్ర మహిళలు ఇబ్బందులు పడుతున్నారని మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సంజయ్.