ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాలను గద్దె దింపే హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఈసారి భిన్నమైన తీర్పు ఇచ్చారని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఒక విడత కింద నవంబర్ 12న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. గుజరాత్లో మాదిరే హిమసీమలోనూ కమలం మళ్లీ విరబూస్తుందని చాలా పోల్స్ చెప్పాయి.
రాష్ట్రంలోని మొత్తం 68 సీట్లకుగాను బీజేపీకి 38 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే చెప్పింది. కాంగ్రెస్ 28 సీట్లతో రెండో స్థానానికి పరిమితమవుతుందని, మిగిలిన రెండు సీట్లు ఇతరుకు వస్తాయని అంచనా వేసింది.బీజేపీకి, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని పీ మార్క్ సర్వే అంచనా. అధికార పార్టీకి 34 నుంచి 39 సీట్లు వచ్చే అవకాశముందని సర్వే అభిప్రాయం. విపక్ష కాంగ్రెస్ పార్టీకి 28 నుంచి 33 సీట్లు, ఇతరులకు 1 నుంచి 4 సీట్లు దక్కొచ్చట.
జన్ కీ బాత్ సర్వే ప్రకారం.. బీజేపీకి 32 నుంచి 40 సీట్లు రావొచ్చు. 27 నుంచి 34 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమయ్యే అవకాశముంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో ఓట్లను ఈ నెల 8న లెక్కించి ఫలితాలను అదే రోజు ప్రనకటిస్తారు.