వైద్యుల నిర్లక్ష్యం..ఎమ్మెల్యే కూతురు కాన్పు కోసం 12 గంటలు - MicTv.in - Telugu News
mictv telugu

వైద్యుల నిర్లక్ష్యం..ఎమ్మెల్యే కూతురు కాన్పు కోసం 12 గంటలు

November 21, 2019

BJP Mla..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉంటుందో ఓ ఎమ్మెల్యేకు కళ్లకు కట్టినగా ఎదురైంది. తన కూతురు ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడ 12 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లా హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. ప్రజా ప్రతినిధి కూతురుకే ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడితే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైద్య సిబ్బంది తీరు తమపై ఇంకా ఎలా ఉంటుందో ఎమ్మెల్యే అర్థం చేసుకోవాలని స్థానికులు ఆవేదనతో చెప్పారు.  

విజయపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీ కూతురు కాన్పు కోసం షియోపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రసవం చేయకుండా వైద్యలు ఆలస్యం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సాధారణ డెలివరీ సాధ్యం కాదని సిజేరియన్ చేయాలని ముందు చెప్పారని అన్నారు.  ఆ తర్వాత ఆపరేషన్ చేసే డాక్టర్ లేకపోవడంతో సుమారు 12 గంటలు వేచి చూశామన్నారు. అలస్యం అవుతుండటంతో ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లండి అంటూ అక్కడి సిబ్బంది చెప్పడం మరింత విమర్శలకు దారి తీసింది.చివరికి 119 కిలోమీటర్ల దూరం ఉన్న శివపురిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య సిబ్బంది తీరుపై ఎమ్మెల్యేతో పాటు అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.