మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలోని కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందని తేల్చి చెప్పారు. అప్పుడు టీవీలో కేసీఆర్ మాట్లాడితే యువత కేరింతలు కొట్టేదని, ఇప్పుడు చీదరించుకుంటున్నారని విమర్శించారు. మంగళవారం సిద్దిపేటలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పార్టీ నుంచి నేను వెళ్లలేదు. నన్ను వెళ్లగొట్టారు.
పదవుల కోసం పెదాలు మూసే వెధవలు టీఆర్ఎస్ నేతలు. కేవలం మందు గోళీలు ఇవ్వడానికే సంతోష్‌కు రాజ్యసభ పదవి ఇచ్చారు. తెలంగాణలో బెల్టు షాపులను విపరీతంగా పెంచుతున్నారు. హైదరాబాదులో ఏర్పడిన విష సంస్కృతిని బీఆర్ఎస్ ద్వారా దేశవ్యాప్తంగా పెంచడానికి పూనుకున్నారా? పదవుల కోసం పెదాలు మూసే వ్యక్తిని కాను. ఏదైనా ధైర్యంగా మాట్లాడుతా. సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమని చెప్పడం ప్రజలను అవమానించడమే అవుతుంది’అంటూ ఆరోపించారు.