Bjp mla eta rajender convoy issue munugodu
mictv telugu

ఈటల రాజేందర్ కారుపై రాళ్ల దాడి.. గాయాలు

November 1, 2022

Bjp mla eta rajender convoy issue munugodu

మునుగోడులో ఎల్లుండి ఉప ఎన్నిక జరుగునన్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మునుగోడు మండలం పలివెలలో మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వాహనంపై దాడి జరిగింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం భౌతిక దాడికి దారితీసింది.

ఇరు పక్షాలు రాళ్లు రవ్వుకున్నాయి. పలువురికి తలలు పగిలాయి. దాడిలో ఈటల వాహనం ధ్వంసమైంది. ఆయన వ్యక్తిగత సిబ్బందితోపాటు పలువరికి గాయాలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి దాడి చేయించాడని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే బీజేపీ నేతలు ఓటర్లకు పంచడానికి డబ్బు పట్టుకొచ్చారని, అడ్డుకుంటే తమపైనే దాడి చేశారని గులాబీ శ్రేణులు అంటున్నాయి. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.