అనుమానాస్పద స్థితిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

అనుమానాస్పద స్థితిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి!

July 13, 2020

hfttfhghv

పశ్చిమ బెంగాల్‌లోని హెమ్తాబాద్ నియోజ‌క‌వవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. త‌న సొంతూరుకు కిలోమీట‌ర్ దూరంలో ఉన్న బిందాల్ వ‌ద్ద ఆయన మృత‌దేహం ఉరి తడుకి వేలాడుతూ క‌నిపించింది. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఆయన ఆత్మహత్య చేసుకునే మనిషి కాదని.. ఎవరో ఆయన్ను చంపి ఉరితాడుకి వేలాడతీసారని.. ఇది కచ్చితంగా రాజకీయ హత్యేనని ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి కొందరు వచ్చి దేబేంద్ర నాథ్ ను బైక్ పై ఎక్కించుకు పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లారేసరికి బిందాల్ ఏరియాలో మూసివేసిన దుకాణం వరండాలో ఆయన ఉరికి వేలాడుతుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా..వారు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎప్పటినుంచో సీపీఐ(ఎం) పార్టీలో కొనసాగిన దేబేంద్ర నాథ్ 2019లో బీజేపీలో చేరారు.