BJP MLA Raghunandan Rao shows to Photos and videos of Minor Girl Gang Rape Case to media
mictv telugu

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్, ముద్దాయిల్లో హోం మంత్రి మనవడు.. బీజేపీ ఆరోపణ

June 4, 2022

South Korean users file police complaint against Google CEO Sundar Pichai

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిని బాలిక రేప్ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. అమ్నేషియా పబ్ దగ్గర బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనలో హోంమంత్రి మనవడు కూడా ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు. పబ్ పార్టీని బుక్ చేసింది హోంమంత్రి మనవడే అని అన్నారు. హోంమంత్రి పీఏ హరినే అమ్మాయిని లోపలికి పంపించాడని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో(FIR) ముద్దాయిల పేర్లు పెట్టకపోవడం వెనుక అసలు కారణం ఏంటని ప్రశ్నించారు. హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, ఇతర ఎమ్మెల్యేల కుమారుడు ఈ వ్యవహారంలో ముద్దాయిగా ఉన్నారు కాబట్టే ఎఫ్ఐఆర్‌లో వారి పేర్లు పెట్టలేదని రఘునందన్ రావు ఆరోపించారు.

రేప్ జరిగిన కారు(TS09 FL 6460)లో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడంటూ ఫోటోలు, వీడియోలు మీడియాకు చూపించారు. ఇంతవరకూ ఆ కారును ఎందుకు సీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. పోలీస్ వ్యవస్థ అంతా మజ్లీస్ చేతిలోనే ఉందని ఆరోపించారు. ఇలాంటి కేసులో సామాన్యులు ఉంటే వారిని వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు.. అధికార పార్టీకి చెందిన వ్యక్తులపై ఇలా నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని , లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలన్నారు.