రాజాసింగ్ హౌస్ అరెస్ట్.. భైంసా వెళ్లకుండా కాపలా - MicTv.in - Telugu News
mictv telugu

రాజాసింగ్ హౌస్ అరెస్ట్.. భైంసా వెళ్లకుండా కాపలా

January 14, 2020

jkgb

 హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్లకు నిరసనగా ఆయన ఈ రోజు ఛలో భైంసాకు పిలుపునిచ్చారు. ఉద్రిక్తతలు తెలుత్తాయనే అనుమనంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. 

రాజాసింగ్ అనుచరులపైనా కన్నేశారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా సోమవారం రాత్రి నుంచి కాపలా కాస్తున్నారు.  భైంసా పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగ్గా, పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని అదుపులో ఉంచారు. 2 బెటాలియన్ల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కాపలా కాస్తున్నారు. వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ ఆపేశారు. కాగా, ఘర్షణలో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి.