‘జార్జిరెడ్డి’పై అభ్యంతరం లేదు, కానీ: ఎమ్మెల్యే రాజాసింగ్  - MicTv.in - Telugu News
mictv telugu

‘జార్జిరెడ్డి’పై అభ్యంతరం లేదు, కానీ: ఎమ్మెల్యే రాజాసింగ్ 

November 19, 2019

ఉస్మానియా యూనివర్సిటీ చేగువేరాగా పేరొందిన జార్జిరెడ్డి జీవితం ఆధారంగా తీసిన చిత్రంపై గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తమకు ఈ సినిమాపై అభ్యంతరం లేదని, అయితే అందులో వాస్తవాలను మాత్రమే చూపించాలని అన్నారు. 

చిత్రాన్ని అడ్డుకుంటామని ఏబీవీపీ కార్యకర్తలు చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ప్రచార వీడియోల్లో ఏకపక్షంగా చూపించారు. సినిమా పేరుతో ఏబీవీపీని కించపరిస్తే సహించం, అడ్డుకుంటాం. జార్జిరెడ్డి హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే  ఏబీవీపీ వ్యక్తులు ఆయనను హత్య చేసినట్లు చూపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించాలి. ఏబీవీపీ కార్యకర్తలపై దాడులు చేయించింది జార్జిరెడ్డే. మీరు నిజాలు చూపండి. . అబద్ధాలు కనుక చూపిస్తే మా నుంచి హండ్రెడ్ పర్సంట్ రియాక్షన్ ఉంటుంది’ అని హెచ్చరించారు.

Bjp mla raja singh.

అన్నారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ‘దళం’ దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించగా, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించారు.