BJP mla raja singh warning to comedian munawar faruqui
mictv telugu

హైదరాబాద్ వస్తే.. నీ అంతు చూస్తా.. కమెడియన్‌కు రాజాసింగ్ వార్నింగ్

August 11, 2022

వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ టూర్ తెలంగాణ రాష్ట్రంలో కాక రేపుతోంది. కామెడీ షో లో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ ఈనెల 20వ తేదీన డోంగ్రీ టు నోవేర్ అనే పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో మళ్ళీ ఆయన కార్యక్రమాన్ని రద్దు చెయ్యాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మునావర్ ఫారూఖీ షోను వ్యతిరేకిస్తూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. హైదరాబాద్ నగరంలో మునావర్ ఫారూఖీ షో నిర్వహిస్తే ఆ ప్రదేశాన్ని తగలబెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫారుఖీ షో నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసులను డిమాండ్ చేశారు. మునావర్ ఫారూఖీ షోకి ఎవరైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

గతంలో తన కామెడీ షోలో భాగంగా సీతాదేవిపై మునావర్ చేసిన వ్యాఖ్యలతో హిందూ సమాజం తీవ్రంగా మండిపడింది. అతడు తమ రాష్ట్రంలో షోలు నిర్వహించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అతడు హైదరాబాద్‌ రాకుండా బ్యాన్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.