BJP MLA Rajasingh challenged Asaduddin Owaisi
mictv telugu

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఆ ముగ్గురికి రాజాసింగ్ సవాల్

August 9, 2022

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి ముగ్గురు నేతలకు సవాల్ విసిరారు. మీలో దేశభక్తి ఉంటే ఇంటిపై జెండాను ఎగురవేసి సెల్యూట్ చేయాలంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, పీడీపీ నేత మహబూబా ముఫ్తీ, టీఎంసీ నేత మమతా బెనర్జీలకు సవాల్ విసిరారు. అటు ఓవైసీ ఇంతకు ముందే ప్రతీ ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఆ జెండాలు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు కనపడే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పౌరసత్వ చట్టం ద్వారా ముస్లింలను అణచివేయాలనే ఎత్తుగడలు వేస్తున్నారని, అది రాజ్యాంగ విరుద్ధ చట్టమన్నారు. ఎన్ఆర్‌సీ కూడా రాజ్యాంగ విరుద్ధమని దేశంలో ఎంతమంది ప్రజలకు పాస్‌పోర్టు ఉందో వెల్లడించాలని కేంద్రాన్ని నిలదీశారు.