BJP MLA Rajasingh Complaint On BulletproofVehicle
mictv telugu

పరేషాన్‌లో రాజాసింగ్

November 17, 2022

జైలు నుంచి బయటకొచ్చినా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కష్టాలు తప్పడం లేదు. సర్కార్ ఇచ్చిన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం నాకొద్దు బాబూ అంటూ మొరపెట్టుకుంటున్నారు.ధనిక తెలంగాణలో ఇంత పాతవాహనమేంటంటూ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు.

పాత వాహనం..ఒకటే పరేషాన్…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చింది. రాజాసింగ్ భద్రతకు ముప్పు ఉందన్న కారణంతో ఈ వాహనాన్ని కేటాయించారు. కానీ ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుంది. సరిగ్గా నడవం లేదని రాజాసింగ్ వాపోతున్నారు. ఓసారి హైకోర్టుకు వెళ్తుంటే ట్రాఫిక్‌లో ఆగిపోయింది. ఆ తర్వాత చాలాసార్లు సతాయించిందట. అందకే ఈ వాహనం వద్దు..కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలని ఇంటెలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ రాశారు.

ప్రశ్నల వర్షం

“నా భద్రతకు ముప్పు ఉంది. ఉగ్రవాదుల నుంచి థ్రెట్ ఉంది. ఇలాంటి వాహనం ఇస్తే ఎలా? ధనిక తెలంగాణలో పాత వాహనం ఏంటి?కొత్త వాహనానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వడం లేదా? లేక అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ? అని రాజాసింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

లైఫ్ డేంజర్

ఈ మధ్య కొందరు ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ వాహనాలు ఇచ్చారు. అందులో తనపేరు ఎందుకు లేదన్నారు రాజాసింగ్. లైఫ్ డేంజర్‌లో ఉందని, నియోజకవర్గంలో తిరగాలంటే ఈ వాహనంతో కుదరడం లేదంటున్నారు. వెంటనే కొత్త బుల్తెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాజాసింగ్ పై పీడీయాక్ట్ ఎత్తేయడంతో గతం వారం జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు రెండునెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక అభివృద్ధి పర్యవేక్షణ కోసం నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. కానీ సర్కార్ ఇచ్చిన బుల్టెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తూ ఆయన్ను ఇబ్బంది పెడుతుంది.