BJP MLA Rajasingh made comments that bullets will be used against him for talking about Dharma
mictv telugu

100% నన్ను చంపేస్తారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

August 10, 2022

 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూటికి నూరు శాతం తనను చంపేస్తారని, ఇది పక్కా అని, డేట్ కూడా రాసిపెట్టుకోండంటూ కామెంట్స్ చేశారు. గ్రేటర్ పరిధిలోని నగర శివారులో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మం కోసం మాట్లాడుతున్న తనను నూటికి నూరు శాతం చంపేస్తారని పేర్కొన్నారు. ఆ విషయం తనకు కూడా తెలుసన్నారు.

ప్రతి గ్రామంలోనూ హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ముస్లింలుగా మారుస్తున్నారని చెప్పారు. లవ్ జీహాద్ పేరుతో హిందూ యువతులను పిల్లలను కనే మిషన్లుగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా హిందువులతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని చెప్పారు. ధర్మం కోసం ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వారి గొంతులు, తలలను నరుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మం గురించి తనలాంటి వారు కొందరు మాట్లాడుతారని, అలా మాట్లాడుతున్నందుకు ఈ రోజు కాకుంటే రేపు తనపై తూటాలను పేల్చుతారని ఆయన అన్నారు.

చచ్చేముందు తనకొక కల ఉందని చెప్పారు రాజాసింగ్. అందరూ తనలాగే తయారై ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం తన ఒక్కడి కల మాత్రమే కాకూడదని.. ప్రతి ఒక్క హిందువు కల కావాలని స్పష్టం చేశారు. రాజకీయం వేరు.. ధర్మం వేరు అని చెప్పిన రాజాసింగ్.. ఏ పార్టీలో ఉన్నా ధర్మాన్ని రక్షించొచ్చని వ్యాఖ్యానించారు. ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.