BJP MLA T Raja singh in dilemma..Whats Next?
mictv telugu

రాజాసింగ్ దారి అటేనా?

November 29, 2022

బీజేపీ ఫైర్ బ్రాండ్,ఎమ్మెల్యే రాజాసింగ్ ఒంటరి అయ్యారా? జైలుకు వెళ్లివచ్చాక ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? కోర్టు పీడీ యాక్ట్ ఎత్తేసినా…బీజేపీ హైకమాండ్ ఎందుకు సస్పెన్షన్ వేటు తీసేయం లేదు. రాజాసింగ్ పై ఢిల్లీపెద్దలకు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిందెవరు? ఇంటర్నల్ పాలిటిక్స్‌లో రాజాసింగ్ నలిగిపోతున్నారా? వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేయబోతున్నారా?రాజాసింగ్‌ని బీజేపీ వదలుకుంటుందా?

ఎందుకీ మౌనం…

రాజాసింగ్..బీజేపీ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే. పార్టీలో రైజింగ్ లీడర్.హిందూవాణిని వినిపించడంలో ఇతనికి ఎవరూ సాటిలేరు.అదే స్థాయిలో వివాదాలకు కేరాఫ్ అయ్యారు. నగరానికే చెందిన ఎమ్మెల్యే అయినా తెలంగాణ అంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎమ్మెల్యే అయ్యాక కూడా పలుమార్లు అక్రమ గో వధను అడ్డుకున్నారు. కబేళాలకు తరలిస్తున్న గోవుల్ని రక్షించారు. ఎప్పుడూ సెల్ఫీ వీడియోలతో బర్నింగ్ పాలిటిక్స్ లో యాక్టివ్‌గా ఉండేవారు. ఈ క్రమంలో మహ్మాద్ ప్రవక్తపై చేసిన వీడియో కాంట్రవర్సీకి కారణమైంది. పెద్దయెత్తున దుమారం రేపింది. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. పీడీ యాక్ట్ కేసు పెట్టి తెలంగాణ ప్రభుత్వం రాజాసింగ్‌ను జైలుకు పంపింది. ఆ తర్వాత హైకోర్టు పీడీ యాక్ట్ కేసు ఎత్తేయడంతో షరతులపై బయటకొచ్చారు. జైలు నుంచి వచ్చాక రాజాసింగ్ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. స్వంతవేదిక పెట్టుకోవాలనే యోచనలో ఉన్నారని సమాచారం. సస్పెన్షన్ ఎత్తేయకపోవడంపై రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నారట. దీనికితోడు ఇంటర్నల్ పాలిటిక్స్ రాజాసింగ్ ని ఇబ్బంది పెడుతున్నాయట.

డైలామాలో…

బీజేపీలో ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు. ట్రిపుల్ ఆరే మా బలం అంటోంది రాష్ట్ర బీజేపీ. గత అసెంబ్లీ బీజేపీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ .ఆతర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి రఘునందర్ రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీకి వచ్చారు. వీళ్లు సభకు రాకముందు అసెంబ్లీలో రాజాసింగ్ బీజేపీ వాణిని వినిపించారు. ఆ తర్వాత ఆయనకు వీళ్లిద్దరు తోడయ్యారు. నగరానికి చెందిన ఎమ్మెల్యే అయినా రాజాసింగ్‌కు తెలంగాణ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. రాజాసింగ్ అంటే బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేకమైన గౌరవం. కానీ ఆ ఒక్క వీడియోనే ఆయన్ను కష్టాల పాల్జేసింది.గోషామహల్ నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి పేరుంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎవరు నిలపడినా ఇక్కడ రాజాసింగే గెలుస్తారని వారి కాన్ఫిడెంట్. అలాంటి రాజాసింగ్ ఇప్పుడు డైలామాలో పడ్డారు. పార్టీ తనను ఒంటరి చేసిందని ఫీలవుతున్నారట.

ఇంటర్నల్ పాలిటిక్స్
రాజాసింగ్‌కు నగరానికి చెందిన బీజేపీ ముఖ్యనేతకు మధ్య విభేదాలున్నాయని తెలుస్తోంది. గతంలో పలుమార్లు బయటపడ్డాయి. రాజాసింగ్ పార్టీ వీడుతారన్న ఊహాగానాలు వచ్చాయి. ఆయన ఢిల్లీకి వెళ్లడంతో రాజాసింగ్ యాక్టివ్ అయ్యారు. కానీ అనుచిత వ్యాఖ్యల వీడియోతో మళ్లీ కథ మొదటికొచ్చింది. దీన్నే అవకాశంగా తీసుకుని రాజాసింగ్‌ని ఇబ్బందిపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్ పై తొలినుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సానుకూలంగా ఉన్నారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుతున్నారు. జైలు లో ఉన్నప్పుడు న్యాయసాయం కూడా చేశారు. మేము ఉన్నామంటూ రాజాసింగ్ కుటుంబాన్ని ఓదార్చారు. అయితే రాజాసింగ్ పై బీజేపీ అగ్రనేత అమిత్ షా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.దీనికి కొందరు ఇచ్చిన ఫీడ్ బ్యాకే కారణమని రాజాసింగ్ భావిస్తున్నారు.

కార్యకర్తల మాట

రాజాసింగ్ సారీ చెప్పారు.జైలుకెళ్లి వచ్చారు.సో ఆయనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలు కోరుతున్నారు. అసదుద్దీన్ , అక్బరుద్దీన్‌లకు మించి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేస్తున్నారు. రాజాసింగ్ లాంటి నాయకుల్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

బీజేపీ ఏం చేయబోతోంది?

రాజాసింగ్‌ని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా?స్వతంత్రంగా బరిలో దిగితే ఎవరికి నష్టం.?ఇది పక్కా బీజేపీకే. ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు.అందులో కీలక నగర ఎమ్మెల్యే రాజాసింగ్ ని వదులుకుంటే పార్టీకే నష్టమని కేడర్ భావిస్తోంది. అయినా రాజాసింగ్ ను వదులుకోవడానికి బీజేపీ సాహసం చేయకపోవచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్యాయం అంటోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. ఈ సమయంలో బలం పెంచుకోవాలే తప్ప…కీలక నేతల్ని వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. మరి రాజాసింగ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.