BJP Moves TS HighCourt as BL Santhosh,Lawyer get SIT Notice
mictv telugu

సంతోష్ వస్తారా?లేక అరెస్ట్ చేస్తారా?

November 19, 2022

BJP Moves TS HighCourt as BL Santhosh,Lawyer get SIT Notice

ఫామ్హౌజ్ కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్‌లో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇచ్చింది. బీఎల్ సంతోష్ విచారణకు హాజరవుతారా?సిట్ నోటీసులపై స్పందిస్తారా?లేదంటే బీఎల్ సంతోష్‌ని సిట్ అరెస్టు చేస్తుందా?ఫామ్ హౌస్ కేసులో ఏం జరగబోతోంది?

సిట్ స్పీడప్

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల21న ఉదయం 10:30గంటలకు హాజరుకావాలని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో 41 ఏ సీఆర్సీసీ కింద ఈ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని సిట్ తెలిపింది. అటు తుషార్‌కూ సిట్ నోటీసులు పంపింది. ఆయన్ను 21నే విచారణకు రావాలని ఆదేశించింది. రామచంద్రభారతి,ఫైలట్ రోహిత్ రెడ్డిలతో తుషార్ ఫోన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. అటు కేరళలో రెండు బృందాలుగా తనిఖీలు చేశారు. రామచంద్రభారతి ప్రధాన అనుచరుడు జగ్గూకోసం అన్వేషిస్తున్నారు.వీరిద్దరి కన్న ముందు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. బీఎల్ సంతోష్ ,శ్రీనివాస్‌లను ఒకే సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణ చేయాలని సిట్ భావిస్తోంది.

హైకోర్టుకు బీజేపీ

సిట్ నోటీసులపై బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డికి హైకోర్టుకు వెళ్లారు. బీఎల్ సంతోష్,తుషార్‌లతో పాటు శ్రీనివాస్ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. దర్యాప్తు పేరిట సంబంధంలేని వ్యక్తుల్ని ఇరికించేందుకే నోటీసులు ఇచ్చారని ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. పిటిషనర్ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా?లేక సిట్ ప్రయత్నాలే నెగ్గుతాయా? అనేది ఉత్కంఠగా మారింది

అసలేం జరిగింది

మొయినాబాద్‌లోని రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల ఎర కేసుకు కేంద్రమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వలబాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్ రెడ్డిలను రామచంద్రభారతి, నందకుమార్ , సింహయాజిలు కలిశారు. బీజేపీ తరఫున వచ్చామని, పార్టీ మారితే ఒక్కొక్కరికి వందకోట్లు ఇస్తామని చెప్పారు. ఓకే అంటే బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ , తుషార్‌లతో మాట్లాడిస్తామని వారు చెప్పారు. ఇదంతా జరిగే ముందే నలుగురు ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రివర్స్ ట్రాప్ లో ఆడియో, వీడియోలు పోలీసులు రికార్డ్ చేశారు. ఈ వీడియోలను స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. మరోవైపు హైకోర్టులో కేసు నడుస్తోంది.