‘గాంధీ స్వాతంత్య్ర పోరాటం ఓ డ్రామా'..బీజేపీ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

‘గాంధీ స్వాతంత్య్ర పోరాటం ఓ డ్రామా’..బీజేపీ ఎంపీ

February 3, 2020

bbfgn

ఉత్తర కన్నడ బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ..మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్య్ర పోరాటాన్ని ‘డ్రామా’గా అభివర్ణించారు. 

ప్రజలు గాంధీని మహాత్మా అని పిలిచినప్పుడల్లా తన రక్తం మరిగిపోతుందన్నారు. గాంధీ నేతృత్వంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులను పోలీసులు ఒక్కసారి కూడా కొట్టలేదన్నారు. వీళ్ళ స్వాతంత్య్ర పోరాటం పెద్ద డ్రామా అన్నారు. బ్రిటిషర్ల అనుమతి, మద్దతుతోనే స్వాతంత్య్ర పోరాటం అనే డ్రామా చేశారన్నాడు. గాంధీ చేపట్టిన నిరాహార దీక్షలను, సత్యాగ్రహ ఉద్యమాలను హెగ్డే డ్రామాగా అభివర్ణించారు. గాంధీ చేపట్టిన నిరాహార దీక్ష, సత్యాగ్రహం వల్లే స్వాతంత్య్రం వచ్చిందని కాంగ్రెస్ మద్దతుదారులు చెబుతున్నారు. కానీ, అది నిజం కాదు. సత్యాగ్రహం వల్ల బ్రిటిషర్లు దేశాన్ని వీడలేదన్నారు. అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసింది.