ప్రధానేమో నగదు వద్దంటాడు.. ఎంపీలేమో నగదే కావాలంటారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధానేమో నగదు వద్దంటాడు.. ఎంపీలేమో నగదే కావాలంటారు..

November 24, 2017

ఢిల్లీలో యూపీ ఎంపీ యశ్వంత్ సింగ్‌కు చెందిన కారులో రూ. 2 లక్షలకుపైగా నగదు చోరీ అయింది. చాందీని చౌక్ ప్రాంతంలో పార్క్ చేసిన ఆయన కారు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఈ డబ్బు ఎత్తుకెళ్లారు. మొదట పోలీసులకు ఫిర్యాదు చేసే అంశంపై తటపటాయించిన ఎంపీ తర్వాత ఎట్టకేలకు ఫిర్యాదు చేశాడు.ఈ చోరీపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నారు. ప్రధాని మోదీ ఒక పక్క నగదు రహితం అని అంటోంటే ఎంపీలు ఇలా లక్షల నగదు పెట్టుకుని రోడ్లపైన నిర్లక్ష్యంగా తిరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. మెదీ ఆశయ సాధనకు బీజేపీ ఎంపీలే తూట్లు పొడుస్తున్నారని, అసలు బీజేపీ ఎంపీల వద్ద ఎంత నగదు ఉందో చెప్పాలని అంటున్నారు. కొందరైతే.. ఆ డబ్బుకు తెల్లధనమో, నల్లధనమో పోలీసులు విచారించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.