సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం కోసం 15 విమానాలు - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం కోసం 15 విమానాలు

November 24, 2019

ఎంపీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం వేడుక ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. దుబాయ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి టీడీపీ, వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు కూడా కలిసి హాజరు అవుతున్నారు. రస్ అల్ ఖైమాలో జరిగే ఈ వేడుకకు వెళ్లే అతిథుల కోసం ప్రత్యేకించి 15 విమానాలను ముందుగానే బుక్ చేశారు. రెండు ముఖ్య పార్టీల నుంచి నేతలు కలిసి ఈ వేడుకలకు హాజరౌతుండటం చర్చనీయాంశంగా మారింది. 

CM Ramesh.

ఇటీవల ఎంపీ సుజనా చౌదరీ బీజేపీతో ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్య చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రమేష్ ఇంట్లో శుభకార్యం రాజకీయ మార్పులకు వేదికగా మారబోతోందనే ప్రచారం ప్రారంభమైంది. అందుకే విదేశాల్లో ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని టీడీపీ, వైసీపీ ఖండించాయి. కాాగా రాజమండ్రికి చెందిన  ప్రముఖ వ్యాపారవేత్త ఆలూరి రాజా కుమార్తె పూజతో సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ కు నిశ్చితార్థం జరగనుంది.ఆలూరి రాజా కుటుంబ సభ్యులు అంతా వైద్యులే. వీరంతా అమెరికాలోనే నివాసం ఉంటున్నారు.