BJP MP janardhanmishra Contravercy Comments
mictv telugu

తాగి ఊగండి.. గుట్కా నమలండి…!

November 8, 2022

ఉత్త చేతులతో అప్పట్లో టాయిలెట్‌ను శుభ్రం చేసిన ఎంపీ గుర్తు ఉన్నారు కదా…ఆయనే జనార్దన్ మిశ్రా. అదే బీజేపీ ఎంపీ. ఈయన అడుగేస్తే సంచలనం..మాట్లాడితే వివాదం…కవరేజ్ ఇవ్వడం లేదనుకున్నాడేమోగానీ ఉన్నట్టుండి మళ్లీ ఓ బాంబ్ పేల్చారు. మద్యం తాగాలని,గుట్కా నమలాలని ప్రజలకు ఎంపీ జనార్దన్ మిశ్రా పిలుపునిచ్చారు.

విచిత్ర వ్యాఖ్యలు
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. తాగే బాటిల్ పైనే కాదు చూసే సినిమాకు ముందు ఈ బోర్డు పడుతోంది. బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా సంథింగ్ డిఫరెంట్. తాగి ఊగండి…గుట్కా నమలండి అని ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ఏమైనా ఫర్వాలేదు పేపర్లు , టీవీల్లో తాను కనిపిస్తే చాలు అనే లెవల్లో కామెంట్లు చేశారు. ఈయనకు ప్రచార పిచ్చి ఎక్కువ.అందులోనూ కొంచెం తిక్క..ఎప్పుడు ఏం చేస్తారో..ఏం మాట్లాడుతారో ఆ పార్టీ నేతలకే అర్థం కాదు

అసలు ఏమన్నారంటే

మధ్యప్రదేశ్ రేవాలోని కృష్ణరాజ్ ఆడిటోరియంలో నీటి సంరక్షణపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవా ఎంపీ జనర్దన్ మిశ్రా పాల్గొన్నారు. నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడితో ఆగేది బాగుండేది..అసలే ప్రచార పిచ్చి…ఇంకేముంది నోటికి ఏదివస్తే అది మాట్లాడేశారు. మద్యం తాగండి..గుట్కా తినండి,థిన్నర్ ని పీల్చండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. సులేసాన్ లేదంటే ఐయోడెక్స్ తినండి కానీ నీళ్ల ప్రాముఖ్యతను మా త్రం అర్థం చేసుకోండి అని మిశ్రా అన్నారు. కరెంట్ బిల్లులతోపాటు ఇతర ట్యాక్స్ లను మాఫీ చేయాలని కోరాలని పిలుపునిచ్చారు.

గతంలోనూ…
ఎంపీ జనార్దన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎంపీ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలోనూ ఇలా ఎన్నోసార్లు విచిత్రమైన కామెంట్లు ఆయన చేశారు. ఉత్త చేతులతో బాత్రూమ్ కడిగి వైరల్ అయ్యారు.