బురదలో శంఖం ఊదితే కరోనా పోతుంది.. బీజేపీ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

బురదలో శంఖం ఊదితే కరోనా పోతుంది.. బీజేపీ ఎంపీ

August 14, 2020

BJP MP on Corona Immunity

కరోనాను కట్టడి చేసేందుకు యావత్ ప్రపంచం శ్రమిస్తోంది. వ్యాక్సిన్ కోసం పరిశోధకులు కుస్తీలు పడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఎవరికి నచ్చిన చిట్కాలు వారు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అంటూ పొంతనలేని విధానాలు  చెబుతున్నారు. దీనికి రాజకీయ నాయకులు కూడా అతీతం కావడంలేదు. తాజాగా రాజస్థాన్‌ బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా మరో చిట్కా చెప్పాడు. బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా రాదని వ్యాఖ్యానించారు.

బురదలో కూర్చొని ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఫలితంగా  కరోనా పై సమర్ధవంతంగా పోరాడటంతో ఆ వైరస్ దరిచేరదని పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఓ కేంద్రమంత్రి  అయితే ‘భాభీజీ అప్పడాల్లో’ రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఉన్నాయ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.