BJP MP Ravi Kishan, father of four calls for Population Control bill
mictv telugu

జనాభా నియంత్రణపై బిల్లు.. ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్లు ఫైర్..

July 24, 2022

రేసుగుర్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. బీజేపీ పార్టీలో ఉన్న రవికిషన్ ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా ఉన్నారు. జనాభా నియంత్రణ బిల్లు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రవికిషన్ విలేకరులతో మాట్లాడుతూ..జనాభా నియంత్రణపై తాను ఓ ప్రైవేట్ బిల్లును లోక్ సభలో ప్రేవశపెట్టబోతున్నానని తెలిపారు.

ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండకుండా నిరోధించడమే దీని లక్ష్యం. ‘జనాభా నియంత్రణ బిల్లు తీసుకువచ్చినప్పుడే మనం విశ్వగురువు కాగలం. జనాభా నియంత్రణ అత్యావశ్యకం. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటం దిశగా వెళ్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టేలా విపక్ష పార్టీలు సహకరించాలి. నేను ఎందుకు ఈ బిల్లు పెట్టాలనుకుంటున్నానో వినాలని కోరుతున్నాను’ అంటూ రవి కిషన్ వెల్లడించారు. కేంద్రమంత్రులు కాకుండా పార్లమెంట్‌ సభ్యులు ప్రవేశపెట్టేవాటిని ప్రైవేటు బిల్లులు అంటారు. ఇప్పుడు రవికిషన్ ప్రవేశపెట్టేది కూడా ప్రైవేటు బిల్లే.

అయితే రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు ఆడుకుంటున్నారు. రవికిషన్ ను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. రవికిషన్ కు మగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక జంటకు ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉందకూడదని చెబుతున్న మీరు చేసిదేంటని ప్రశ్నిస్తున్నారు. కుమారుడు పుట్టేంత వరకు పిల్లలను కంటూనే ఉన్న మీరు జనాభా నియంత్ర బిల్లును పెడతాను అనడం హాస్యాస్పదం అని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు. మీరు బిల్లు పెడితే మీకు ఇద్దరు పిల్లలు మాత్రమే దక్కుతారని.. ఎవరో తేల్చుకోవాలని మరో నెటిజెన్ వ్యాఖ్యానించాడు.