గాంధీ జాతిపిత కాదు, గొప్పబిడ్డ మాత్రమే.. బీజేపీ ఎంపీ సాధ్వి - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ జాతిపిత కాదు, గొప్పబిడ్డ మాత్రమే.. బీజేపీ ఎంపీ సాధ్వి

October 21, 2019

Sadhvi Pragya calls Mahatma Gandhi son of the nation

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వార్తల్లో నిలుస్తారు.  2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గాంధీని హత్యచేసిన గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె భోపాల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగింది. బీజేపీ నిర్వహిస్తున్న గాంధీ సంకల్పయాత్రలో మీరు ఎందుకు పాల్గొనడం లేదు అని ప్రశ్నించారు. దానికి సాధ్వి.. గాంధీ జాతిపిత కాదు, ఈ దేశం కన్న గొప్ప బిడ్డ అని సమాధానం ఇచ్చారు. 

ఆయన ఈ దేశం కోసం ఎంతో శ్రమించారు, కష్టపడ్డారు. అందుకు మేమంతా ప్రశంసిస్తాం. ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం అని వ్యాఖ్యానించారు. ‘గాంధీ భారతీయులు అందరి చేత ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, మహాత్ముడు. జాతిపిత కంటే ఈ దేశానికి ఒక గొప్ప బిడ్డ’ అని చెప్పారు. అయితే ఆమె వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భోపాల్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై తాను భారీ మెజార్టీతో గెలిచానని.. ఇంతకుమించి వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని సమాధానం ఇచ్చారు.