నైట్ క్లబ్బుకు  రిబ్బన్ కత్తించిన సాక్షి మహరాజ్! - MicTv.in - Telugu News
mictv telugu

నైట్ క్లబ్బుకు  రిబ్బన్ కత్తించిన సాక్షి మహరాజ్!

April 16, 2018

విదేశీ సంస్కృతి, కురచ బట్టలు, మద్యపానంపై విమర్శలు చేసే బీజేపీ ఎంపీ, సాధువు సాక్షి మహరాజ్ ఓ నైట్ క్లబ్బును ప్రారంభించారు. లక్నోలోని అలీగంజ్‌లో ఏర్పాటు చేసిన ఈ క్లబును మహజార్ ఆదివారం రిబ్బన్ కత్తిరించి, జనాన్ని లోపలికి తీసుకెళ్లారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క తన నియోజకవర్గమైన ఉన్నావ్‌లో ఒక అమ్మాయిపై బీజేపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారని విమర్శలు వెల్లువెత్తుతోంటే ఇదేం పని అని కాంగ్రెస్ ప్రశ్నించింది.

విమర్శలు రావడంతో మహరాజ్ స్పందించారు. తాను ప్రారంభించేది నైట్‌ క్లబ్ అని తనకు తెలియదని వివరణ ఇచ్చారు. తాను సర్వసంగ పరిత్యాగిని అని, తను ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు.  యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు రజ్జన్ సింగ్ పిలిస్తే ఆయన అల్లుడి క్లబ్బును ప్రారంభించడానికి వెళ్లానని, అయితే అది నైట్ క్లబ్లు అన్న సంగతి తనకు తెలియదని అన్నారు.