డైరెక్టర్ రాజమౌళికి ఎంపీ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

డైరెక్టర్ రాజమౌళికి ఎంపీ వార్నింగ్

October 27, 2020

director

ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్ర ధరించిన టోపిని తొలగించాలని సూచించారు. లేకపోతె సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. డబ్బుల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీమ్‌ను చంపిన వాళ్ళ  టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. 

ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెల్సిందే. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. గోండు వీరుడు కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ నెల 22న కొమరం భీం జయంతిని పురస్కరించుకుని రామ్ చరణ్ వాయిస్‌తో భీంకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియో చివర్లో భీం పాత్రలో ఉన్న ఎన్టీఆర్ ముస్లింలు ధరించే టోపీ ధరిస్తాడు. దీనిపై కొందరు తెలంగాణ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ సరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021లో విడుదల కానుంది. దాదాపు 400 కోట్ల రూపాయలతో రూపొందుతోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.