కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

January 16, 2020

Laxmi Devi.

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఏ వ్యాఖ్యలు చేసినా ఆసక్తికరంగా ఉంటాయి. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తారు. సొంత పార్టీ నేతలపై కూడా కీలక వ్యాఖ్యలు చేయడంపై కూడా ఏ మాత్రం వెనకాడరు. అలాంటి ఆయన తాజాగా మన దేశ కరెన్సీపై మనుసులో మాటను బయటపెట్టారు. నోట్లపై లక్ష్మీదేవి ప్రతిమను ముద్రించడం మంచిదని పేర్కొన్నారు. దీని వల్ల మన దేశ కరెన్సీ పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. 

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా‌లో జరిగిన స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల కార్యక్రమానికి సుబ్రహ్మణ్య స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఇండోనేషియా కరెన్సీని ప్రస్తావించారు. అక్కడ నోట్లపై గణేషుడి ప్రతిమ ముద్రిస్తారని మన దేశంలో అలాంటి అవసరం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా లక్ష్మీ దేవి బొమ్మను ముద్రించాలని వ్యాఖ్యానించారు. నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడానికి తాను అనుకూలమని స్పష్టం చేశారు. ఈ విధంగా అయిన భారత కరెన్సీ‌ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.గణేషుడు విఘ్నాలను తొలగిస్తే.. లక్ష్మీదేవి డబ్బును వృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.