‘పతంజలి’పై బాబా రాందేవ్ కు బీజేపీ ఎంపీ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

‘పతంజలి’పై బాబా రాందేవ్ కు బీజేపీ ఎంపీ వార్నింగ్

November 24, 2022

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. యోగా పితామహుడిగా పేరు గాంచిన మహర్షి పతంజలి పేరుతో వ్యాపారం చేయడాన్ని ఆక్షేపించారు. ఆ పేరు వాడుకోవడం ఆపేయాలని డిమాండ్ చేశారు. మహానుభావుడి పేరుతో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రాందేవ్.. ఆయన పుట్టిన ఊరికి మాత్రం ఏం చేయలేదని విమర్శించారు.

‘వ్యాపారం ఏదైనా నెయ్యి, ప్యాంట్లు, సబ్బులు, లోదుస్తులకు పతంజలి పేరు వాడుకోవడం బాలేదు. అయినా ఆ హక్కు ఆయనకు ఎవరిచ్చారు. పేరు మార్చకుంటే ఉద్యమం చేయడంతో పాటు న్యాయపరమైన చర్యలకు దిగుతామ’ని హెచ్చరించారు. కాగా, మహర్షి పతంజలి సొంతూరు లక్నోకి 140 కిలోమీటర్లు దూరంలో ఉన్న గోండా జిల్లా కొండార్ గ్రామం. గురువారం ఎంపీ అక్కడికి వెళ్లి గ్రామ పంచాయితీలో విలేకరులతో మాట్లాడారు. పతంజలి నెయ్యి తింటున్నవారు ఆయన స్వగ్రామం ఎలా ఉందో చూడాలని, అయోధ్య సందర్శించే భక్తులు కొండార్ గ్రామాన్ని కూడా ఎలా ఉందో చూడాలన్నారు.