BJP National Executive Member, MLA Etela Rajender press meet at Shameerpet
mictv telugu

కేసీఆర్ ప్రభుత్వ పాలన.. రాచరికపు పోకడకు పరాకాష్ట: ఈటల రాజేందర్

January 25, 2023

తెలంగాణ సీఎం కేసిఆర్ రాజ్యాంగాన్ని అపహస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బుధవారం శామీర్ పేట్ లోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. జనవరి 26 రాజ్యాంగ ఆమోదం పొందిన రోజని… ఆ రోజుని కరోనా పేరుతో రాష్ట్రంలో గణతంత్ర వేడుకలను నిర్వహించలేమని ప్రభుత్వం చెబుతున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం రాచరిక పోకడ అని దుయ్యబట్టారు. ప్రభుత్వం అంటే అధికార పార్టీ మాత్రమే కాదని, ప్రతిపక్షాలు కూడా అందులో భాగమేనన్నారు. గతంలో ఏదైనా సమస్య వస్తె అన్ని పార్టీల సలహాలు తీసుకునే వారని, కానీ కేసిఆర్ హయాంలో అటువంటి దాఖలాలలేవీ కనిపించడం లేదన్నారు.

కేసీఆరే పంపిణీ చేస్తున్నారు..

పార్టీల మధ్య సీఎం కేసీఆర్ ఇనుప గోడలు పెడుతున్నారు, కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే అన్న భావనతో తమను ఇతర సమావేశాలకు కూడా ఆహ్వానించట్లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను డబ్బుతో ముడిపెడుతున్నారని, ఇతర పార్టీల నేతలను వెలగట్టి మరీ కొంటున్నారని, తెలంగాణ మేధావులు ఈ విషయంపై ఆలోచించాలన్నారు. సామాన్యులు ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసిఆర్ డబ్బులు పంపిస్తున్నారని, ఈ డబ్బంతా..మీ తాత జాగీరా? అని ప్రశ్నించారు.

మీడియా గొంతు నొక్కుతున్నారు..

సచివాలయం ప్రారంభానికి తమిళనాడు సీఎం, జార్ఖండ్ CM , యూపీ డిప్యూటీ సీఎం వస్తున్నారట….వీరంతా ఎందుకు వస్తున్నారు. కేవలం ప్యాకేజ్ ఇచ్చి వీరిని ప్రోగ్రామ్స్ కి పిలిపించుకుంటున్నరు. తెలియకుండానే కేసిఆర్ జేబులు కొడుతున్నారు. ఎస్సీ కాలనీ లో కరెంట్ కట్ చేస్తున్నారు. డిస్కంలు అప్పుల ఉబిలో ఉన్నాయని Telangana State Electricity Regulatory Commission తెలిపింది.ఈ విషయాన్ని స్వయంగా CMD ప్రభాకర్ రావు వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీడియా గొంతు నొక్కుతున్నారు. వినకుంటే ఆ సంస్థను కొంటున్నారు.

నీక్కూడా చంద్రబాబు గతే..

ఎన్నికల్లో డబ్బులు పంచినా.. ఎన్నికల కమిషన్ చూస్తూ ఉంది తప్పా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కేసిఆర్‌కు పోలీసులు తొత్తులుగా మారారు. స్వయంగా ఎన్నికల డబ్బును పోలీసులే వారి వాహనాల్లో తరలిస్తున్నారు. యూనిఫాం డిపార్ట్మెంట్ లో మెదడుకు ఆస్కారం లేదా? అని ప్రశ్నించారు. లాంగ్ జంప్ పై విద్యార్థుల ఆందోళన నీకు కనపడట్లేదా?బషీర్ బాగ్ కాల్పులు జరిపిన చంద్రబాబు కి పట్టిన గతే నీకు పడతది.

అప్పుల కుప్పగా రాష్ట్రం

తెలంగాణ వచ్చినప్పుడు 10300 బస్సులు ఉండేవి ఇప్పుడు 9000 మాత్రమే ఉన్నాయి. తొమ్మిది వేల లో 3000 ప్రైవేటు బస్సులే. ఆర్టీసి బస్సులు లేక ఊర్లలో విద్యార్థులు స్కూల్స్ కి వెల్లాట్లేదు. రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్పలుగా మార్చారు. ధరణి తో లక్షల కోట్లు కొల్లగొట్టారు. ఈ డబ్బును నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఎన్నికల్లో ఎమ్మెల్యే గా నిలబడాలి అంటే 100 కోట్లు ఉండాలి. ప్రగతి భవన్ కేంద్రంగా చిల్లర వాళ్లను కూడగట్టి నన్ను భద్లం చేసే కుట్ర పన్నారు.

దమ్ముంటే నిరూపించు..

మీడియా లో నాపై పిచ్చి రాతలు రాయించారు. ఎల్లమ్మ బండ భూములు ప్రజలకు చెందాలని గతంలో నేను పోరాడాను .దమ్ముంటే అక్కడ నా చుట్టాలు అక్రమించారన్న ఆరోపణల మీద విచారణ జరిపించాలి. హైదరాబాద్ నగరం లో ఆక్రమణకు గురవుతున్న భూముల అన్నింటి మీద సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా.దర్మపొరాటం కోసమే నా భూములు తాకట్టు పెట్టి మరి అప్పు తీసుకున్న … తప్పేముంది? కేసిఆర్ రాజ్యంలో డబ్బులు లేకుండా ఎన్నికలు లేవు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి … వెల్లకిలా పడ్డారు.

పోలీసులకు అదే పని..

కేసిఆర్ మనుషులు అన్ని పార్టీలలో ఉంటారు.వాళ్లే ఆ పార్టీకి చెందిన లీకులు ఇస్తుంటారు కొంత మంది పోలీసులు పూర్తిగా బానిసలుగా మారారు. నాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు… ఎక్కడికి వెళ్తున్నారని ఫాలో కావడమే వాళ్ల పనిగా మారింది. నా మీద ఓడిపోయిన వాళ్లని దొడ్డి దారిన ఎమ్మెల్సీ చేసి కాన్వాయ్ ఇస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.