బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ ఘాటు హెచ్చరిక జారీ చేశారు. తనతో పెట్టుకుంటున్నందుకు దారుణ పర్యవసానాలు ఎదుర్కొంటారని బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. ‘‘నేనేంటో చూపిస్తా.. ఇంతవరకు తెలంగాణలో నా పెరు ఎవరికీ తెలియదు. ఇప్పుడు అందరికీ తెలిసేలా చేశారు’’ అని ఆయన అన్నారు.
హైదరాబాద్లో గురువారం జరిగిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల విస్తారక్ల సమావేశంలో ఆయన పాల్గొని తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పరిపాలన బాగోలేదని, ప్రజాస్వామ్యానికి ఇది శాపమని విమర్శించారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారని మండిపడ్డారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలని దర్యాప్తు సంస్థలు నోటీసు ఇచ్చినా సంతోష్ పట్టించుకోవడం లేదు. కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేయడంతో సంతోష్ పరిస్థితి ఏమిటని ఆసక్తి మొదలైంది. బీఎల్ సంతోష్ అనుమతితోనే నిందితులు కోనుగోలు వ్యవహారం నడిపించారని పోలీసులు చెబుతున్నారు.