BJP OBC National Morcha president K Laxman has filed his nomination as a Rajya Sabha candidate
mictv telugu

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన కె. లక్ష్మణ్‌

May 31, 2022

BJP OBC National Morcha president K Laxman has filed his nomination as a Rajya Sabha candidate

బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ వెళ్లిన ఆయన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి లక్ష్మణ్‌ను రాజ్యసభకు బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన విషయం తెలిసిందే.

కాగా ఇంతకుముందు రాజ్యసభ అవకాశం తనకు కల్పించడం పట్ల కె.లక్ష్మణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘బీజేపీ తప్ప మరే పార్టీలోనూ సాధ్యం కానిది. ‘సాధారణ కార్యకర్తకు లభించిన గౌరవం, గుర్తింపు ఇది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు’’ అని లక్ష్మణ్‌ తెలిపారు. గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు లక్ష్మణ్. లక్ష్మణ్‌తో పాటు 8 మంది రాజ్యసభ అభ్యర్థులు మంగళవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.