ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వంద కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వంద కోట్లు

October 26, 2022

మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కింది.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మహేశ్వరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది.

భారీగా డబ్బు పట్టుకుని మొయినాబాద్ అజీజ్ నగర్‌లోని పీవీఆర్ ఫాంహౌజ్ కు వచ్చిన బీజేపీ నేతల బృందం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతుంటే హైదరాబాద్‌ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.15 కోట్ల రూపాయల నగదును సీజ్‌ చేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చినవారిలో
బీజేపీ నేతలు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌ ఉన్నారు.