మోడీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు... - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు…

July 25, 2017

 

ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్  వెలగడం అంటే ఇదే గావొచ్చు. బల్బున్నదగ్గర వెలగ లేదు. అదే విచిత్రం.  ఈ స్విచ్, బల్బు  విషయం గురించి   వివరంగా వెలగాలంటే… ఈ స్టోరీ  చదవాల్సిందే…..

ప్రధాన మంత్రి మోడీ గారు. బెంగుళూరులో  కార్యాలయాన్ని తెరవాలని డిసైడ్ అయ్యారు. త్వరలో  కార్యాలయం ప్రారంభం  కూడా కాబోతున్నది. ఢిల్లీ బహుత్ దూర్ హై అనే ప్రశ్నకు ఈజీగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దామోదర దాస్ నరేంద్ర మోడీ. ఈ దేశానికి రెండో రాజధాని ఉండాలని అదీ నాగపూర్ కంటే హైద్రాబాద్ బెటర్ అని అప్పట్ల  అంబేద్కర్ చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా దీని గురించి చర్చ జరిగింది…..  దట్ ఈజ్ ఎండ్.

ఇంతకూ మోడీ సారుకు సౌత్ లో కార్యాలయం స్టార్ట్ చేయాలని ఎందుకు అన్పించిందనే విషయం గురించి కొంచెం  తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళనాడు  నుండి కమల్, రజనీ లాంటి స్టార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఢిల్లీ దూరం అనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే  ఉత్తరాది పెత్తనం చెల్లదని చెవులు  పగిలేట్లు… మైకులు  రీసౌండ్ తో మోగేట్లు చెప్పారు.

అందుకే సౌత్ ఇండియన్ల గురించి ఏ మాత్రం ఆలస్యం చేసినా ఇబ్బందనే విషయాన్ని మోడీ అండ్ కో  గుర్తించిందని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతే కాదు దక్షిణాది వారు  దేశ  రాజకీయాల్లో అనుకుంతగా రాణించడం లేదు.  ఉత్తరాదిన ఉన్న ఒకటి రెండు రాష్ట్రాల వారిదే పెత్తనం ఉందనే  విమర్శ ఉండనే ఉంది.  ఇవన్నీ తగ్గించడానికి మోడీ ఓ అడుగు ముందుకేశారు. అందులో భాగంగానే  బెంగుళూరులో కార్యాలయం ప్రారంభం అనుకోవచ్చు.

ఇదే కాదండోయ్… ఇంకో ముచ్చటా విన్పిస్తున్నది… ఇదే అస్సలు విషయాని కొందరు చెవులు కొరుకుంటున్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత ఉత్తరాది, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను పోషించేది దక్షిణాది రాష్ట్రాలే అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. బెంగుళూరు, హైద్రాబాద్, చెన్నై, బాంబే.. ఇవే  సగానికి పైగా ఆదాయాన్ని దేశానికి ఇస్తున్నాయనే ప్రచారం జోరందుకున్నది. మరిలాంటి సమయంలో బాధ్యతగల నాయకుడుగా మోడీ దక్షిణాదిన కార్యాలయం తెరిచి ఇక్కడి వారికీ అందుబాటులో ఉండాలని అనుకుంటున్నట్లుంది.

పనిలో పనిగా బిజెపి…ఆర్ఎస్ఎస్ పట్టుకున్న రాష్ట్రం కూడా కార్నటక కావడంతో ఆయన అక్కడ ఉన్నట్లు ఉంటుంది… పార్టీ నాయకులకు అందుబాటులో ఉన్నట్లూ ఉంటుంది. అదే హైద్రాబాద్ లో అయితే ఏం అంత ఫయిదా ఉండదనే అనుకున్నారో లేక పోతే దాని కంటేబెంగుళూరు బెటర్ అనుకున్నారో తెలియదు.

ఏదేమైనా సరే పరిపాలనా పరంగా చూస్తే దక్షిణాదిన ప్రధాన మంత్రికి కార్యాలయం ఉండటం… ఇక్కడికి వారికి అందుబాటులో ఉంటానంటే… అంతకంటే కావాల్సిదేముంటుంది చెప్పిండి. ఈ విషయంలో మాత్రం మోడీ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే.