పద్మినీరెడ్డి ఓ కోవర్ట్.. అందుకే.. నటి మాధవి - MicTv.in - Telugu News
mictv telugu

పద్మినీరెడ్డి ఓ కోవర్ట్.. అందుకే.. నటి మాధవి

October 12, 2018

ఆయారాం గయారాం రాజకీయాలకు తాజా తాజా ఉదాహరణ పద్మినీరెడ్డి. ఆమె నిన్న ఉదయం బీజేపీలో చేరడం, రాత్రి మళ్లీ ప్లేటు ఫిరాయించి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తలపండిన రాజకీయ విశ్లేషకులను సైతం దిమ్మెక్కించింది. మోదీ నాయకత్వ లక్షణాలకు మెచ్చే కాషాయదళ తీర్థం పుచ్చుకున్నానన్న పద్మిని తర్వాత కాంగ్రెస్ అభిమానుల మనోభావాలను గౌరవించి హస్తంలోకి వచ్చానని చెప్పారు. ఆమె బీజేపీలో చేరడంతో భర్త, మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ తీవ్ర మనస్తాపం చెందారని, ఆమెను బుజ్జగించి మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించారని సమాచారం.

BJP leader and actress Madhavi tags Padmini Reddy being covert and joined BJP to know its secretes to reveal Congress and satires baby other allegations

ఈ తతంగంపై కాంగ్రెస్ తలపట్టుకుని విచారిస్తోంటో, బీజేపీ మాత్రం గయ్యిమంటోంది. పద్మినీరెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పార్టీ నేత, నటి మాధవి.. తీవ్ర పదజాలంతో పద్మినిపై ఆరోపణలు గుప్పించారు. పద్మిని కోవర్ట్ పనుల కోసమే తమ పార్టీలో చేరిందని, అయితే బండారం బయటపడుతుందనే భయంతో తిరిగి వెళ్లిపోయిందని అన్నారు.

‘పొద్దునేమో మోదీజీ భావజాలం సూపర్.. సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది. పద్మిని.. మా  పార్టీలో చేరే ముందు తర్వాత జరిగేదేందో ఆలోచించలేదా? ఏం పసిపిల్లలా..? తెలియకపోవడానికి పాలు తాగుతున్నారా ఏంటి..? పద్మినీరెడ్డి పెద్ద పథకంతో కోవర్ట్ పాలిటిక్స్ చేయడానికి బీజేపీలోకి వచ్చారు. ఎన్నికల్లో బీజేపీ ప్లానేంటో తెలుసుకుని భర్త ఉన్న పార్టీలో చెప్పడానికా? వీటినే కోవర్ట్ పాలిటిక్స్ అంటారు.. దేనికోసం నాటకం? మిమ్మల్ని నమ్మి ఘనంగా స్వాగతం పలకండం బీజేపీ తప్పు కాదు. దీనివల్ల మీకే నష్టం’ అని హెచ్చరించారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందిస్తూ.. పద్మిని వ్యవహారం తమ పార్టీపై ఎలాంటి ప్రభావమూ చూపదన్నారు.