బిజెపి అస్సలు ప్లాన్ ఇదీ... - MicTv.in - Telugu News
mictv telugu

బిజెపి అస్సలు ప్లాన్ ఇదీ…

September 2, 2017

బిజెపి సౌత్ లో  చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నది. తమకు కులం లేదంటూనే కుల సమీకరణలు బలంగా చేస్తున్నట్లుంది.  దత్తాత్రేయ రాజీనామా  చేసిన తర్వాత ఆయన ఈ స్థానాన్ని తెలంగాణా నుండి భర్తీ చేయాలని అనుకుంటున్నట్లుంది. అందుకే  భువనగిరికి చెందిన  వెదిరి శ్రీరాంరెడ్డిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది.  తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల విషయమై ఇటివలీ కాలంలో పెద్ద  ఎత్తున చర్చ జరుగుతున్నది. రెడ్లను మచ్చిక చేసుకుంటే బావుంటుందనే థాట్ బిజెపి నేతల్లో వచ్చిందనే ప్రచారం జరుగుతున్నది.

అంతే కాదు తెలంగాణలో బలపడాలంటే రెడ్లను, ఆంధ్రాలో బలపడాలంటే కమ్మ లేదా బ్రాహ్మీన్ల పట్టుకోవాలని చూస్తున్నట్లుంది. అందుకే  చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నది. వెదిరే శ్రీరాం కు జాతీయ స్థాయిలో ఓ నేమ్  ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదనే  ఆలోచన చేసినట్లుంది.  2019 ఎన్నికల్లో రెడ్లను తమ  వైపుకు తిప్పుకునేందుక ప్లాన్ చేస్తున్నట్లు వార్తులు వస్తున్నాయి.

టిఆర్ఎస్ తో  మంచిగ  ఉంటూనే తాను బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.  అందులో భాగంగానే  ఎపిలో కూడా  పాగా వేసుందుకు మాంచి ఎత్తుగడ వేసింది. కేసీఆర్ కు  దెబ్బతగల కుండా తన పని తాను చేసుకు పోవాలని చూస్తున్నట్లుంది.  బిసీల నుండి లక్ష్మణ్  కు పెద్ద స్థాయి ఇచ్చింది. దత్తు లేకున్నా లక్ష్మణ్ ఉన్నాడుకదా అని చూపించే  ప్రయత్నం అన్నట్లు. ఇదంతా రెడ్లపై ప్రేమ కాదు. ఇక్కడ బలపడాలంటే ఇది  తప్పమరో మార్గం లేదనేది వాళ్ల అంతరార్థం అనే ప్రచారం కూడా ఉంది.

తెలంగాణలో బలపడితే  గనుక  అటు ఢిల్లో లేక పోయినా  పర్వా లేదు. హైద్రాబాద్ లో ఉన్నాం కదా అని చెప్పుకునే ప్లాన్ కూడా ఉంది బిజెపికి.  హైద్రాబాద్ నుండి దక్షిణ భారత దేశాన్ని డీల్ చేయడం వెరీ ఈజీ అవుతుంది. పైగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టలు బలంగా ఉన్నాయి. వాటిని దెబ్బతీస్తే అంతా సెట్ అవుతుందని అనుకుంటున్నట్లుంది. అందులోనూ రెడ్లే ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలను లీడ్  చేస్తున్నారు. అన్నీ ప్లస్ పాయింట్లు చూసుకున్న తర్వాతనే బిజెపి అడ్వాన్స్ అవుతున్నట్లుంది.

అయితే వెదిరికే  పదవి ఇస్తారనే ఊహాగానాలో ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వెదిరే కెపాసిటీని బట్టి కూడా ఇవ్వొచ్చు కదా. దానికి కులానికి లింకేమిటీ అనే వాళ్లు కూడా ఉన్నారు.  ఏదేమైనా  బిజెపి తెలంగాణలో బలపడాలనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదనేది మాత్రం వాస్తవం అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.  ఎట్లా చూసినా బిజెపి మాత్రం  మాంచి ప్లాన్ తోనే  ఉన్నట్లుంది.