కొత్త ఆర్థిక మంత్రి అమిత్ షా.. రక్షణ మంత్రి ఇరానీ! - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త ఆర్థిక మంత్రి అమిత్ షా.. రక్షణ మంత్రి ఇరానీ!

May 25, 2019

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కొత్త బాధ్యతలు రానున్నాయి. మోదీ కేబినెట్‌లో ఆయనకు బెర్త్ ఖరారైంది. ఈ నెల 30న నరేంద్ర మోదీ రెండో పర్యాయం ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు ఎంపీలు మంత్రులుగా బాధ్యతలు చేపడతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Bjp president amit shah may be finance minister and smriti irani gets defense ministry in modi’s new canbinet   

అరుణ్ జైట్లీ అనారోగ్యం వల్ల ఆర్థిక శాఖను అమిత్ షాకు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆర్థిక శాఖ కాకపోతే రక్షణ లేదా హోం శాఖనైనా ఇస్తారని, ప్రస్తుత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీలో ఓడగొట్టిన స్మృతి ఇరానీకి రక్షణ శాఖ దక్కొచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అనారోగ్యం వల్ల పోటీ చేయలేకపోయిన సుష్మా స్వరాజ్‌ను కూడా విదేశాంగ శాఖ నుంచి తప్పించి యువ నాయకులకు పెద్ద పీట వేస్తారని అంటున్నారు. శనివారం జరిగే ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో కేబినెట్ కూర్పుపై చర్చిస్తారు. కీలక మిత్రపక్షమైన శివసేనకు కూడా రెండు బెర్తులు దక్కుతాయని అంచనా. కేబినెట్ కూర్పులో అంతిమంగా ఆరెస్సెస్ మాటే నెగ్గుతుందని, నితిన్ గడ్కారీ, రాజ్‌నాథ్, ప్రకాశ్ జవదేవకర్ తదితరుల పదవులుకు ఢోకా ఉందని అంచనా. తెలంగాణ నుంచి గెలిచిన వారిలో ఒకరికి.. ముఖ్యంగా కిషన్ రెడ్డికి కూడా అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు.