BJP released video on Delhi liquor scam
mictv telugu

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం.. వీడియో విడుదల చేసిన బీజేపీ

September 5, 2022

సంచలనం సృష్టించిన వివాదాస్పద ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి స్టింగ్ వీడియోను బీజేపీ సోమవారం మీడియాకు రిలీజ్ చేసింది. ‘ఇక తప్పించుకోలేరు మనీష్ జీ’ అని ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. ‘కుమ్మక్కు కార్యక్రమం కింద లాభంలో కేజ్రీవాల్‌కు 80 శాతం, మనీష్ సిసోడియాకు, అతని స్నేహితుడికి వెళుతుంది. ముందు మాకు 80 శాతం ఇచ్చి మిగతా 20 శాతం అమ్ముకో. మాకు అభ్యంతరం లేదు. ఇదీ కేజ్రీవాల్ విధానం’ అంటూ ఆరోపించారు. అంతేకాక, ట్రేడర్లు ఎవరూ భయపడవద్దని, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఎంత కమీషన్ చెల్లిస్తున్నామో వీడియో రికార్డు చేయాలని సంబిత్ పాత్రా కోరారు. కేజ్రీవాల్ అధికారంలో వచ్చిన తొలి రోజుల్లో ఎక్కడ అవినీతి జరిగినా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాలని కోరారని, ఇప్పుడు కూడా అదే జరిగినట్టు వెల్లడించారు. స్టింగ్ మాస్టర్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్ జరిగినట్టు వివరించారు. కాగా, మద్యం కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీద సీబీఐ కేసులు నమోదు చేయడం తెలిసిందే. అతని ఇంటిలో సోదాలు నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించింది. అటుఈ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే.