BJP shouldn't give Oscar win credit to Modi: Kharge
mictv telugu

“ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మోదీ డైరెక్ట్ చేశారని దయచేసి చెప్పొద్దు”..రాజ్యసభలో నవ్వులు పూయించిన ఖర్గే

March 14, 2023

BJP shouldn't give Oscar win credit to Modi: Kharge

రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యులను నవ్వులు పూయించాయి. ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సౌత్ ఇండియన్ చిత్రాలు ఆర్ఆర్ఆర్,ది ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అభినందనలు చెప్పిన సమయంలో ఆయన బీజేపీపై వదిలిన వ్యంగ్యస్త్రాలు నవ్వులు పూయించాయి. ఆస్కార్‌ అవార్డులను బీజేపీ ఖాతాలో వేసుకోవద్దని సూచించారు.

రెండు భారతీయ సినిమాలకు ఆస్కార్‌ అవార్డులు దక్కడంతో నేను గర్వంగా ఫీలవుతాన్నా అని ఖర్గే తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అవార్డులు సాధించి చిత్ర బృందాలను ప్రశంసించి.. అభినందనలు తెలిపారు. ఈ విషయం బీజేపీ ప్రభుత్వానికి, మోదీ ఓ విన్నపం అంటూ మాట్లాడారు.”. దయచేసి ఈ ఆస్కార్‌ అవార్డుల క్రెడిట్‌ను మాత్రం మీ ఖాతాలో వేసుకోకండి. ఆ సినిమాలను డైరెక్ట్‌ చేసింది మోదీనే అని, పాట రాసింది మేమే, డైరెక్ట్‌ చేసింది మేమే అని చెప్పకండి. అదొక్కటే నా విజ్ఞప్తి’ అని ఖర్గే ఎద్దేవ చేశారు. దీంతో ఒక్కసరిగా సభలో సభ్యులు నవ్వారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌‌తో పాటు, అధికార పార్టీ సభ్యులు చిరునవ్వులు చిందించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేసింది