ఆస్పత్రిలో  చేరిన బీజేపీ నేత - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్పత్రిలో  చేరిన బీజేపీ నేత

May 28, 2020

కరోనా వైరస్‌ విజృంభణ దేశంలో ఏమాత్రం తగ్గడంలేదు కదా. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్‌ నేత, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆసుపత్రిలో చేరారు. కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షల కోసం గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన చేరినట్లు సమాచారం.  దీనిపై సంబిత్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. కరోనా పరీక్షల నిమిత్తం చేరినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉండే ఆయన ఆయన గురువారం కూడా పలు ట్వీట్లు చేశారు.