బీఫ్ అమ్ముతున్న బీజెపి నాయకులు ! - MicTv.in - Telugu News
mictv telugu

బీఫ్ అమ్ముతున్న బీజెపి నాయకులు !

July 5, 2017


బీఫ్ ను బ్యాన్ చేసినవాళ్ళే అమ్మితే ఎలా వుంటుంది ? ఇంకెలా వుంటుంది దెయ్యాలు సంత జరిపినట్టు వుంటుంది. అచ్చు అలాగే వుంది మన బిజెపి సర్కార్ పనితీరును చూస్తుంటే. కేరళా రాష్ట్రంలో స్వయానా కమలం నాయకులే కో-ఆపరేటివ్ సొసైటీలో బీఫ్ అమ్ముతున్నారంటే నమ్ముతారా మీరు ? నమ్మాలి.. నమ్మలేని నిజంలా వుంది కదూ ? అవునూ కేరళాలోని బిజెపి జిల్లా నాయకుడు ఏ. నగేష్, సెక్రెటరీ టి. యస్. ఉల్లాస్ బాబు ఇంకా బిఎమ్ఎస్ సెక్రెటరీ పి. వి. సుబ్రమణియన్ లు కలిసి ఎంచక్కా బీఫ్ అమ్ముకుంటూ రాజకీయాలు చేస్తున్నారు.

గోవధ పరమ నేరం, ఘోరమని మాట్లాడిన బిజెపి సర్కార్ మనుషులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి ? అది కూడా కో-ఆపరేటివ్ సొసైటీలో పెద్దకూర అమ్ముతున్నారంటే వాళ్ళకు దండేసి దండం పెట్టవలసిందే కదా.. బీఫ్ తింటున్నారనే అక్కసుతో ముస్లింలను, దళితులను హత్య చేస్తున్న సంఘ్ పరివారంకు ఈ దుష్ఠశక్తులు కనిపించడం లేదా ? కనిపించినా మనవాళ్లే పోనీలే అని చూసీ చూడనట్టు వూరుకుంటున్నారా ? ఏమో మరి.. ఎందరో అభాగ్యుల ఆకలి తీర్చడంలో విఫలమౌతున్న సెంటర్ సర్కార్ కొన్ని వర్గాలవారిని టార్గెట్ చేసిందనే ఆరోపణలు వున్నాయి. గడుస్తున్న ఈ గడ్డు రోజుల్లో పిఎం మాటల్ని కూడా జనాలు నమ్మి గొర్రెలు అవాల్సిన అవసరం లేదని నెటిజనులు రియలైజ్ అవుతున్నారు.

అయినా ఈ మధ్య కషాయం పార్టీ వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటిలా తయారైంది వాళ్ళ వరస ? నిన్న గాక మొన్న ఉత్తరప్రదేశ్ లో బిజెపీ లీడర్ హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తుంటే పట్టుకున్న లేడీ పోలీసాఫీసరుతో దురుసుగా వ్యవహరించడమే కాదు ఆమెను ఎక్కడో నేపాల్ మారుమూల ప్రాంతానికి బదిలీ చేసేసారు. అలాగే మహారాష్ట్రలో నడుస్తున్న బస్సులో ఒక మహిళను పట్టుకొని ముద్దులు పెట్టాడు ఓ కమలనాథుడు. ఇదీ వరసన్నమాట మన బిజెపి నేతల తీరు !? ఇన్ని జరుగుతున్నా మోడీ చూసీచూడనట్టు ఊరుకుండటం వెనుక మతలబు వున్నదని చాలా మందికి ఎరుకైపోయింది.

http://bit.ly/2tgbq8G