దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించింది RRR సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. నటించిన ఈ సినిమాకు ఇటీవలే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. సినిమాలోని ”నాటు నాటు” సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో హాలీవుడ్ ఇచ్చే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం కైవసం చేసుకోవడంపై మూవీ యూనిట్ ప్రతీ ఒక్కరూ అభినందనలు తెలిపారు. పీఎం నరేంద్ర మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు.. ఎంతోమంది చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందనలు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి.
#RRR సినిమా వేస్తే థియేటర్లు తగలబెడతామన్న బండి సంజయ్ ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సంబరాలు చేసుకోవడమేంటీ..?@KTRTRS @ysathishreddy pic.twitter.com/ROXJ9BZM0R
— BULLET SURI BRS 🏌️ (@BulletSuri7) January 11, 2023
ఎందుకంటే గతంలో.. బండి సంజయ్ ఆర్ఆర్ఆర్ సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు. ”కొమురం భీం చరిత్రను కించపరిచేలా.. ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా తీశావు. బిడ్డా రాజమౌళి ఈ సినిమాను నువ్వు రిలీజ్ చేస్తే నిన్ను బడిసెలతో కొట్టి కొట్టి పంపిస్తాం. అదే విధంగా సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లను కాల్చేస్తాం” అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. కానీ ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ట్విట్టర్ వేదికగా ఆ సినిమాపై ప్రశంసలు కురిపించాడు బండి సంజయ్. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అప్పుడు రిలీజ్ చేస్తే కాల్చేస్తా అన్నావ్.. ఇప్పుడు అవార్డులు రాగానే విషెస్ ఎలా చెప్తున్నావ్ అంటూ నిలదీస్తున్నారు.
Ab kya hua @bandisanjay_bjp ?
AAG Nhi lagoge ?? Jo tum logo ko sabse acha aata hai !! https://t.co/JqpI0MJajE pic.twitter.com/x8MpX7MKmX
— Vinod Kapri (@vinodkapri) January 11, 2023